పుట్టినరోజునే మృత్యుఒడికి
యశవంతపుర: పుట్టినరోజు అని సంతోషంగా ఉన్న యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ ఘటన చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా హరియబ్బెలో గురువారం జరిగింది. పీయుసీ చదువుతున్న చిదానంద (17) గురువారం స్నేహితులతో బర్త్ డే చేసుకుని మంగుసవళ్లిలోని ఇంటికి పల్సర్ బైక్‌లో బయల్దేరాడు. గ్రామ పంచాయతీ చెత్త వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు మెరుగైన చికిత్సల కోసం తుమకూరుకు తరలిస్తుండగా దారిలో చనిపోయాడు.
ఇద్దరు విద్యార్థులు అదృశ్యం
చిక్కమగళూరు జిల్లా తేగూరు గ్రామంలోని వసతి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తరుణ్, యశ్విత్‌లు అదృశ్యమయ్యారు. 10 రోజుల కింద రాత్రివేళ పరారయ్యారు. పిల్లల కోసం తల్లిదండ్రులు పరితపిస్తున్నారు. పోలీసులు గాలింపు చేపట్టారు.
కుంభమేళా ఘటనలో పరిహారం
దొడ్డబళ్లాపురం: ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాలో తొక్కిసలాటలో 37 మంది చనిపోవడం తెలిసిందే. యూపీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు తలా రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది. బెళగావి జిల్లాకు చెందిన జ్యోతి, మేఘా, అరుణ, మహాదేవి అనే నలుగురు ఇందులో మరణించారు. ఒక్కొక్కరి కుటుంబానికి రూ. 25 లక్షల చొప్పున ఆన్‌లైన్ ద్వారా వారి బ్యాంకు ఖాతాలకు ఆర్థిక సాయాన్ని పంపించినట్లు జిల్లా అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment