గవర్నర్ కన్నడలో మాట్లాడాలి
మండ్య: గత మూడేళ్ల నుంచి అసెంబ్లీలో గవర్నర్ హిందీలో మాట్లాడుతున్నా ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కరు కూడా ప్రశ్నించడంలేదని కన్నడ సంఘాల నాయకుడు వాటాల్ నాగరాజు ఆరోపించారు. సోమవారం కన్నడ ఒక్కోట ఆధ్వర్యంలో మండ్య నగరంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. వాటాల్ మాట్లాడుతూ కన్నడనాడులో ఉన్న బెళగావిలో మేయర్‌గా మరాఠి వ్యక్తిని ఎన్నిక చేశారు, అక్కడ కన్నడ నాయకులే లేరా? అని మండిపడ్డారు. కన్నడ నాడులో మరాఠీల పెత్తనం ఏమిటని, ఇక్కడ మరాఠీలు వచ్చి అధికారం చలాయిస్తుంటే కన్నడిగులు ఏమి చేస్తున్నారని విచారం వ్యక్తంచేశారు. ఇకపై అసెంబ్లీలో గవర్నర్ కన్నడలోనే ప్రసంగించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment