కారు నిలిపితే, చక్రాలు ఔట్
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో కొన్ని ప్రాంతాల్లో కార్ల యజమానులకు కంటిమీద కునుకు కరువైంది. అందుకు కారణం.. తెల్లారితే కారులో ఏ పార్టులు ఉంటాయో ఏ పార్టులు ఉండవో అనే దిగులు, అసలు కారు ఉంటుందా ఉండదా అనే భయం పట్టుకుంది. మొన్నటి వరకూ వాహనాల్లో పెట్రోలు, డీజిలు మాత్రమే తస్కరిస్తున్న దుండగులు ఇప్పుడు స్పేర్ పార్ట్స్ విప్పుకుని పరారవుతున్నారు. గాంధీనగర్‌లో ఒక హోటల్ వద్ద నిలిపిన కారుకు ఉన్న నాలుగు చక్రాలను దుండగులు విప్పుకెళ్లారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. హుబ్లికి చెందిన గోవిందగౌడ అనే వ్యాపారి కార్యం నిమిత్తం శనివారం బెంగళూరు వచ్చి రాత్రి గాంధీనగర్‌లో ఒక హోటల్‌లో బస చేశాడు. హోటల్ ముందు కారును నిలిపాడు. ఉదయం లేచి చూసేసరికి కారుకి ఉన్న నాలుగు చక్రాలు మాయమయ్యాయి. సీసీ చిత్రాలలో దొంగల పని బయటపడింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బెంగళూరులో దొంగల గోల
Comments
Please login to add a commentAdd a comment