ఫైనాన్స్‌కు చిరువ్యాపారి బలి
గౌరిబిదనూరు: మైక్రో ఫైనాన్స్ వేధింపులను తట్టుకోలేక ఓ చిరు వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. తాలూకాలోని కాదలవేని పంచాయతీ మరళూరు ఎం.జాలహళ్ళి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. వివరాలు.. మంజునాథ్ (34) ఇంటి అవసరాలు, వ్యాపారం కోసమని ప్రైవేట్ ఫైనాన్స్‌ల వద్ద రూ. 6 లక్షల వరకూ అప్పులు చేశాడని భార్య సవిత తెలిపారు. తోపుడు బండిపై ఎగ్‌రైస్, కబాబ్ వ్యాపారం చేసేవారమన్నారు. కంతులు సక్రమంగా చెల్లిస్తున్నట్లు ఆమె చెప్పింది. ఈ నెల 9న ఎన్‌టి ఫైనాన్స్‌కు వాయిదా కట్టలేకపోయినట్లు తెలిపింది. దీంతో సిబ్బంది తమ బండి వద్దకు వచ్చి గొడవ చేశారు. నా భర్త ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకువస్తానని చెప్పి దారిలో చింతచెట్టుకు ఉరి వేసుకున్నాడని విలపించింది. రూరల్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment