అప్పు జ్ఞాపకాలతో పునీతం
యశవంతపుర: ప్రముఖ కన్నడ దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ 50వ జన్మదినాన్ని అభిమానులు, ప్రజలు బాధాతప్త హృదయాలతో జరుపుకొన్నారు. ఆయన నటనా వైదుష్యాన్ని, సామాజిక సేవలను స్మరించుకున్నారు. బెంగళూరులో కంఠీరవ స్టూడియోలో పునీత్ సమాధిని తెల్లవారుజామునే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అభిమానులు ఆదివారం అర్ధరాత్రి నుంచే అక్కడకు చేరుకుని కేక్‌ను కత్తిరించి నివాళులు అర్పించారు. సోమవారం ఉదయం పునీత్ భార్య అశ్విని, పిల్లలు ధృతి, వందిత, సోదరులు రాఘవేంద్ర, శివ రాజ్‌కుమార్ దంపతులు, వారి పిల్లలు తరలివచ్చారు.
పునీత్ సమాధికి పుష్పాంజలి ఘటించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది అభిమానులు, యువత తరలివచ్చి అప్పును గుర్తుచేసుకున్నారు. కొందరు బాధను తట్టుకోలేక కన్నీరు కార్చారు. ఈ సందర్భంగా అభిమానులకు పానకం, మజ్జిగ పంపిణీతో పాటు అన్నదానం నిర్వహించారు. ఓ అభిమాని అప్పు దీక్షను స్వీకరించినట్లు తెలిపారు. చన్నరాయపట్టణ నుంచి వచ్చినట్లు చెప్పాడు.
శికారిపుర లో
శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని శికారిపుర పట్టణంలో పునీత్ జయంతి వేడుకలను అభిమానులు ఆచరించారు. బృహత్ చిత్రపటానికి పూలదండలు వేసి పూజలు నిర్వహించారు. ప్రజలకు మొక్కలను అందజేశారు. అటవీ అధికారులు హిరేమఠ, రవీంద్ర, రేవణ్ణసిద్దయ్య పాల్గొన్నారు.
ఘనంగా పునీత్ జయంతి
కంఠీరవ స్టూడియోలో
సమాధికి కుటుంబసభ్యుల పూజలు
అప్పు జ్ఞాపకాలతో పునీతం
అప్పు జ్ఞాపకాలతో పునీతం
Comments
Please login to add a commentAdd a comment