
బెంగళూరు: గత కొన్ని రోజులుగా భారీ వర్షాలతో కర్ణాటకలో చాలా ప్రాంతాలు జయమయమయ్యాయి. బీజాపూర్ జిల్లాను వరదలు ముంచెత్తాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లోకి నీరు చేరడంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈక్రమంలోనే ఓ శునకం మాతృత్వానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. నీటిలో తడిసిపోయి చావుబతుకుల మధ్య ఉన్న తన బిడ్డను నోట కరుచుకున్న ఆ శునకం.. దాన్ని మరో గుడిసెలోకి తీసుకెళ్లింది. కాస్త ఎత్తయిన ప్రాంతంలో బుల్లి కుక్కపిల్లను వదిలేసింది. తారాపూర్ గ్రామంలో శనివారం ఈ వీడియో వెలుగు చూసింది. జాతి ఏదైనా తల్లి ప్రేమకు లోటుండదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మనుషుల్లోనే మానవత్వం తగ్గిపోతోందని, జంతువుల్లో దానికి కొదవ లేదని అంటున్నారు.
(చదవండి: దూడకు పాలిచ్చిన శునకం)
Comments
Please login to add a commentAdd a comment