బోనకల్: మండలంలోని ముష్టికుంట్ల ఉన్నత పాఠశా ల పీఎంశ్రీ పథకానికి ఎంపికై ంది. ఈ పథకం ద్వారా నాలుగేళ్ల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.కోటి మేర నిధులు విడుదల కానున్నాయి. ఇందులో భాగంగానే విద్యార్థుల విహారయాత్ర కోసం నిధులు విడుదల చేయగా శనివారం రావినూతల ఉన్నత పాఠశాలను ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు సందర్శించారు. బోధన, అభివృద్ధి కార్యక్రమాలను తహసీల్దార్ పున్నంచందర్, ఎంఈఓ పుల్లయ్య, హెచ్‌ఎం భాగ్యలక్ష్మి, ఆర్‌ఐ లక్ష్మణ్, ఉపాధ్యాయులు పరిశీలించారు. మూడు రోజుల కిందట ఖమ్మం వెలుగుమట్ల పార్క్‌కు తీసుకువెళ్లగా ఆదివారం లక్నవరం, రామ ప్ప, వేయిస్తంభాల ఆలయాలను చూపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment