నాణ్యతలో రాజీ పడొద్దు..
● లిఫ్ట్ పనులు సకాలంలో పూర్తిచేయాలి ● మంచుకొండ ఎత్తిపోతల పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలో వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగర్ నీరు అందించడానికి రూ.66 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మంచుకొండ ఎత్తిపోతల పథకం పనులు నాణ్యతగా చేస్తూనే సకాలంలో పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మండలంలోని వీ.వీ.పాలెం వద్ద సాగర్ ప్రధాన కాల్వకు ఆనుకుని నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఉగాది నాటికి ట్రయల్ రన్ జరిపేలా పనుల్లో వేగం పెంచాలని, ఓవైపు పంప్ హౌస్, మరోవైపు పైపులైన్ పనులు చేపడితే సకాలంలో పూర్తవుతాయని తెలిపారు. తద్వారా సాగర్ జలాలను మండలంలోని చెరువుల్లో నింపి సాగుకు ఇబ్బంది లేకుండా చూడొచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ ఈఈ అనన్య, డీఈ ఝాన్సీ, మార్కెట్, ఆత్మ, సొసైటీల చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, రావూరి సైదబాబు, తాతా రఘురాంతో పాటు తమ్మిన్ని నాగేశ్వరరావు, బండి వెంకన్న, రెంటాల ప్రసాద్, రమేష్, లాలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment