
పిండిప్రోలు సబ్‌స్టేషన్‌కు ఇంటర్‌లింక్ లైన్
తిరుమలాయపాలెం: వేసవి కార్యాచరణలో భాగంగా శుక్రవారం మండలంలోని పిండిప్రోలు సబ్‌స్టేషన్‌కు అనుసంధానంగా కొత్త 33 కే.వీ. ఇంటర్‌లింక్ లైన్ ఏర్పాటుచేశారు. ఈ లైన్‌ను ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి శుక్రవారం చార్జ్ చేశాక మాట్లాడారు. ఇంటర్ లింక్ లైన్‌తో పిండిప్రోలు, తిప్పారెడ్డిగూడెం, హైదర్‌సాయిపేట ఉపకేంద్రాలకు అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరా చేయొచ్చని చెప్పారు. ప్రస్తుతం ఆరెంపుల, కూసుమంచి, మరిపెడ 132 కే.వీ. సబ్ స్టేషన్ నుంచి సరఫరా చేస్తున్నా, సాంకేతిక కారణాలతో ఇబ్బంది ఎదురైతే ప్రత్యామ్నాయ లైన్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఖమ్మం రూరల్ డీఈఓ సీహెచ్.నాగేశ్వరావు, ఏడీఈ బి.రామకృష్ణ, ఏఈలు ఆర్.భాస్కర్, కిలారు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment