
●ఉపాధ్యాయిని.. ఇప్పుడు లెక్చరర్
మధిర: మండలంలోని రాయపట్నం గ్రామానికి చెందిన మాచారపు నాగేశ్వరరావు – సుబ్బమ్మ కుమార్తె కళావతి తల్లిదండ్రులు, భర్త పోలిశెట్టి నాగరాజు ప్రోత్సాహంతో పాటు పట్టుదలగా చదివి ఉద్యోగాలు సాధిస్తోంది. ఆమె పదో తరగతిలోనే చదువు ఆపేసి టైలరింగ్ నేర్చుకోవాలని పలువురు సూచించినా తల్లిదండ్రుల సహకారంతో చదువు కొనసాగించింది. 1–5వ తరగతి వరకు రాయపట్నం ప్రాథమికోన్నత పాఠశాలలో, 6 – 10వ తరగతి వరకు బనిగండ్లపాడు సెయింట్ ఆన్స్‌లో, ఇంటర్ పల్లగిరిలోని మరియనివాస్‌లో, డిగ్రీ మధిర సుశీల కళాశాలలో పూర్తి చేశాక ఎంఏ ఇంగ్లిష్ కూడా చదివి ఎమ్మెస్సీ, బీఈడీ, ఎంఈడీ పూర్తిచేశారు. ఎంఈడీ కేయూ క్యాంపస్‌లో చదివిన ఆమె బంగారు పతకం సాధించింది. ఆపై డీఎస్సీ 2008 ద్వారా ఎంపీపీఎస్ అన్నాయిపాలెంలో ఎస్‌జీటీగా చేరిన కళావతి, మోడల్ స్కూల్‌లో పీజీటీ గణితం ఉపాధ్యాయినిగా ఎంపికై కరీంనగర్ జిల్లా ధర్మపురిలో పనిచేశారు. తాజాగా ఇంగ్లిష్ జూనియర్ లెక్చరర్‌గా ఎంపికై న ఆమె గురువారం కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment