
అండర్‌పాస్ కోసం కొనసాగిన ఆందోళన
చింతకాని: దేవరపల్లి – సూర్యాపేట జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా చింతకాని మండలం బస్వాపురం వద్ద అండర్ పాస్ ఇవ్వాలంటూ రైతులు చేపట్టిన ఆందోళన రెండో రోజైన శనివారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. బస్వాపురం నుంచి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని అల్లీపురం గ్రామం వరకు 53 అడుగుల ప్రభుత్వ డొంక రహదారి ఉందని, జాతీయ రహదారిపై అండర్‌పాస్ ఇవ్వకపోతే సుమారు 100 ఎకరాల్లో ఉన్న పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ఈ నేపథ్యాన అండర్‌పాస్ ఇచ్చేంతవరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు. వివిధ పార్టీల నాయకులు, రైతులు కన్నెబోయిన గోపి, సయ్యద్ ఉస్మాన్, రాసాల మోహన్‌రావు, మార్గం శ్రీను, బొడ్డు వెంకట్రామయ్య, చంద్రకాని కోటేశ్వరరావు, నర్సింహారావు, పేరబోయిన రవి, ముప్పారపు సైదులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment