గొల్లగూడెం వాసికి డాక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

గొల్లగూడెం వాసికి డాక్టరేట్‌

Published Sun, Feb 9 2025 12:23 AM | Last Updated on Sun, Feb 9 2025 12:23 AM

గొల్ల

గొల్లగూడెం వాసికి డాక్టరేట్‌

తల్లాడ: మండలంలోని గొల్లగూడెంనకు చెందిన గొల్లమందల రవికి డాక్టరేట్‌ లభించింది. ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఉన్న భారతీయ ఇంజనీరింగ్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్నోవేషన్‌ యూనివర్సిటీ ద్వారా ఆయనకు డాక్టరేట్‌ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వృక్ష సంపద, వాటి పరిరక్షణ, ఆదివాసీలు ఉపయోగించే ఔషధ మొక్కలపై సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథానికి డాక్టరేట్‌ లభించిందని రవి తెలిపారు. కాగా, 2020 నుంచి 2025 వరకు చేపట్టిన అధ్యయనంలో 1,131 వృక్ష జాతులను గుర్తించగా తెలంగాణలో ఉమ్మడి వరంగల్‌ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే అత్యధిక వృక్షజాతులు ఉన్నట్లుగా తేలిందని వెల్లడించారు. తన పరిశోధనలో సహకరించిన డాక్టర్‌ డి.వీరాంజనేయులు, అసల్ల అప్పయ్య, భరత్‌లాల్‌ మీనా, డాక్టర్‌ రూప వాసుదేవన్‌, డాక్టర్‌ నాగజ్యోతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం

సత్తుపల్లిటౌన్‌: సత్తుపల్లి ద్వారకాపురి కాలనీలో నిర్మిస్తున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయానికి సత్తుపల్లికి చెందిన తోట వెంకట్రావు – బేబి సరోజిని జ్ఞాపకార్థం తోట రమేశ్‌బాబు – జానకీ దంపతులు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు శనివారం రూ.1.11 లక్షల విరాళాన్ని అందజేశారు. ఆలయ కమిటీ బాధ్యులు ద్రోణంరాజు మల్లికార్జునశర్మ, వందనపు సత్యనారాయణ, సోమిశెట్టి శ్రీధర్‌, రాగాల చంద్రారెడ్డి పాల్గొన్నారు.

అంబేద్కర్‌, రాజ్యాంగం సాక్షిగా వివాహం

పెనుబల్లి: అన్నింట్లోకెల్లా రాజ్యాంగం, దాన్ని రచించిన అంబేడ్కరే ముఖ్యమని చెబుతూ యువతీ యువకులు వీటి సాక్షిగా వివాహం చేసుకున్నారు. పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్‌ జార్ఘండ్‌లో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు విజయవాడలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేసే నాగజ్యోతితో వివాహం నిశ్చయమైంది. అయితే, అంబేడ్కర్‌ భావజాలం కలిగిన వీరిద్దరూ శనివారం టేకులపల్లిలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించాక రాజ్యాంగం సాక్షిగా వివాహం చేసుకున్నారు. ఇందులో కొచ్చర్ల శ్రీనివాసరావు, మీసాల రామచందర్‌రావు వివాహ కర్తలుగా వ్యవహరించారు. మాలమహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి మేకతొట్టి కాంతయ్యతో పాటు ఇరువురి బంధువులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

రేషన్‌ దుకాణానికి తాళం వేసిన గ్రామస్తులు

రెండు షాపుల్లో నిల్వల్లో తేడా, కేసు నమోదు

కామేపల్లి: బియ్యం సక్రమంగా ఇవ్వడం లేదంటూ మండలంలోని బర్లగూడెం–1 రేషన్‌ షాపునకు గ్రామస్తులు శనివారం తాళం వేసి నిరసన తెలిపారు. బర్లగూడెం–1 డీలర్‌ లక్ష్మణ్‌కు బండి పాడు రేషన్‌ దుకాణాన్ని కొన్నేళ్ల కిందట ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించగా రెండుషాపులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం బండిపాడు లోని షాప్‌లో బియ్యం పంపిణీ చేపట్టగా కొందరి కే ఇచ్చాక మిగతా వారిని తర్వాత రమ్మని చెప్పా డు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ షా పునకు తాళం వేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్‌ఐ పవన్‌ చేరుకొని షాపులో బియ్యం నిల్వలను తనిఖీ చేయగా బండిపాడులో 17 క్వింటాళ్లు, బర్లగూడెం–1లో 38 క్వింటాళ్లు బియ్యం తక్కువగా వచ్చాయి. ఈ మేరకు డీలర్‌పై కేసు నమోదు చేసి రెండు షాపుల బాధ్యతలను బర్లగూడెం–2 డీలర్‌ వినయ్‌కుమార్‌కు అప్పగించినట్లు తహసీల్దార్‌ సుధాకర్‌ తెలిపారు.

33 క్వింటాళ్ల బియ్యం సీజ్‌

ఖమ్మంక్రైం: ఖమ్మం ప్రకాష్‌నగర్‌ ప్రాంతానికి చెందిన కళ్లెం ఉపేందర్‌రెడ్డి 33 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని నిల్వ చేశాడనే సమాచారం మేరకు త్రీటౌన్‌ పోలీసులు, సివిల్‌ సప్లయీస్‌ ఉద్యోగులు శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఉపేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

దాడి ఘటనలో ఆరుగురిపై కేసు

చింతకాని: బోనకల్‌ మండలం గోవిందాపురం(ఎల్‌), ముష్టికుంట్లకు చెందిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మండలంలోని నాగులవంచ పెట్రోల్‌బంక్‌కు గురువారం అర్ధరాత్రి గోవిందాపురం (ఎల్‌), ముష్టికుంట్లకు చెందిన నారపోగు హరీశ్‌, ఆదూరి గోపి, దారెల్లి వంశీ, ముత్తారపు నవీన్‌, బాజా సురేశ్‌, గూదాల మనోజ్‌ వచ్చారు. ఈ సందర్భంగా బంక్‌ సిబ్బందితో వారు గొడవ పడి దాడి చేశారు. ఘటనపై అంబటి శరత్‌కుమార్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగుల్‌మీరా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
గొల్లగూడెం వాసికి డాక్టరేట్‌1
1/2

గొల్లగూడెం వాసికి డాక్టరేట్‌

గొల్లగూడెం వాసికి డాక్టరేట్‌2
2/2

గొల్లగూడెం వాసికి డాక్టరేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement