
ఆయానే అన్నీ..
కామేపల్లి: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాల్సి ఉండగా, కొన్నిచోట్ల టీచర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఇలాంటి ఘటనే మండలంలో చోటు చేసుకుంది. కామేపల్లి మండలంలోని రాయిగూడెం–2 అంగన్‌వాడీ కేంద్రం టీచర్ కమలమ్మ శనివారం విధులకు హాజరుకాలేదు. దీంతో ఆయా అవంతిక కేంద్రాన్ని తెరిచి ఇద్దరు చొప్పున గర్భిణులు, బాలింతలు, తొమ్మిది మంది చిన్నారులకు పౌష్టికాహారం అందించినట్లు రికార్డులో నమోదు చేసింది. అయితే, అవంతిక కుమార్తె మాత్రమే అక్కడ కనిపించగా మిగతా చిన్నారులు ఎక్కడ ఆని ఆరా తీస్తే నలుగురే వచ్చారని, టీచర్ సూచనలతో అందరికీ హాజరు వేశానని చెప్పడం గమనార్హం. ఈ విషయమై ఐసీడీఎస్ సీడీపీఓ దయామణిని వివరణ కోరగా టీచర్ కమలమ్మ అనుమతి లేకుండా గైర్హాజరైనందున చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఆయానే అన్నీ..
Comments
Please login to add a commentAdd a comment