స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
చింతకాని: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు సూచించారు. మండలంలోని నేరడలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐతో కలిసొచ్చే పార్టీలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు. వార్డు సభ్యులు మొదలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేయడమే కాక అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని సూచించారు. అనంతరం పార్టీ గ్రామశాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గ్రామశాఖ కార్యదర్శి షేక్ దస్తగిరి, సహాయ కార్యదర్శులు మట్టా రవి, కాటిరాల మహేశ్‌తో పాటు మరో 16 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, కొండపర్తి గోవిందరావు, దూసరి శ్రీరాములు, పావులూరి మల్లికార్జున్‌రావు, దూసరి గోపాల్‌రావు, గోగుల ఆదినారాయణ, పెరిక ప్రభాకర్, మట్టా వెంకట్రావు, నరేశ్, ఆంథోని, గోగుల వెంకన్న పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు
Comments
Please login to add a commentAdd a comment