
ఎస్సెస్సీ విద్యార్థులకు 11న అవగాహన
● టీ శాట్, యూట్యూబ్ ద్వారా
వీక్షించేలా ఏర్పాట్లు
ఖమ్మంసహకారనగర్: పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేలా ప్రేరణ, సబ్జెక్ట్ నిపుణులతో అవగాహన కల్పించనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 11న టీ శాట్, యూట్యూబ్ ద్వారా పరీక్షలకు సిద్ధం కావాల్సిన విధానం, ప్రశ్నపత్రంపై అవగాహన కల్పిస్తారు. జిల్లాలోని 434 పాఠశాలల్లో చదువుతున్న 16,416 మంది పదో తరగతి విద్యార్థులు ఈ కార్యక్రమాలను వీక్షించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం పాఠశాలల్లో టీవీలు, ప్రొజెక్టర్లు సక్రమంగా పనిచేస్తున్నాయో, లేదో ముందుగా పరిశీలించాలని అధికారులు సూచించారు. లైవ్ టెలికాస్ట్ సమయాన స్క్రీన్‌పై కనిపించే నంబర్లకు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశమూ ఉందని తెలిపారు.
మంచుకొండ లిఫ్ట్ పనుల పరిశీలన
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని చెరువులకు, అక్కడి నుంచి సాగు అవసరాలకు నీరు సరఫరా చేసేందుకు వీ.వీ.పాలెం వద్ద సాగర్ ప్రధాన కాల్వపై మంచుకొండ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను శనివారం జలవనరులశాఖ సీఈ రమేష్, ఎస్‌ఈ మంగళపుడి వెంకటేశ్వర్లు పరిశీలించారు. పంపు హౌస్, పైపులైన్ పనులపై ఆరా తీసిన వారు మరింత వేగం పెంచాలని సూచించారు. ఈఈ అనన్య, డీఈ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment