
సమస్యలన్నీ పరిష్కరిస్తా..
కూసుమంచి/నేలకొండపల్లి/ఖమ్మం రూరల్: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే ప్రాధాన్యతాక్రమంలో అన్నింటినీ పరిష్కరిస్తానని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో శనివారం ఆయన సమావేశమయ్యారు. గ్రామాల్లో సమ్యలు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై చర్చించాక మంత్రి మాట్లాడారు. పాలేరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని తెలిపారు. కాగా, గిరిజన సంఘాల నాయకులు మంత్రిని సన్మానించి సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు ఆహ్వానించారు.
అలాగే, కూసుమంచి మండలం జీళ్లచెరువులోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో జరగనున్న బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను మంత్రి పొంగులేటికి అందజేశారు. ఈనెల 8నుంచి 13వరకు జరిగే ఉత్సవాలకు హాజరుకావాలని నేలకొండపల్లి మండలంలోని కొత్తకొత్తూరుకు చెందిన పలువురు కోరారు. కాగా, మంత్రి ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన శుభకార్యాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, ఆత్మకమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, నాయకులు భద్రయ్య, కుక్కల హన్మంతరావు, కొండబాల రాంబాబు, రాయపూడి శ్రీనివాస్, బాలసాని లక్ష్మీనారాయణ, బొర్రా రాజశేఖర్, కొప్పుల చంద్రశేఖర్, రామయ్య తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment