
కొత్త జోన్‌లోకి నాలుగు స్టేషన్ల పరిధి
మధిర: సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో ఇన్నాళ్లు కొనసాగుతున్న మధిర సహా మరికొన్ని రైల్వేస్టేషన్ల పరిధి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మారనుంది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఇందుకు సంబంధించి డీపీఆర్‌లు సిద్ధంచేయాలని సైతం రైల్వే బోర్డును ఆదేశించింది. ఇది అమల్లోకి వస్తే కొండపల్లి నుంచి మోటమర్రి సెక్షన్ వరకు 46 కి.మీ. పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లు కొత్త జోన్‌లోకి వెళ్లనున్నాయి.
జిల్లాలో నాలుగు స్టేషన్లు
కొండపల్లి – మోటమర్రి మధ్యలో చెరువు మాధవరం, గంగినేని, ఎర్రుపాలెం, తొండల గోపవరం, మధిర స్టేషన్లు ఉన్నాయి. ఇందులో మధిర సహా మోటమర్రి, తొండల గోపవరం, ఎర్రుపాలెం తెలంగాణ సరిహద్దు ఖమ్మం జిల్లా పరిధిలో ఉండగా, ఇవన్నీ దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి మారతాయి. ఫలితంగా ఇన్నాళ్లు రైల్వే సంబంధిత పనుల కోసం సికింద్రాబాద్ డివిజన్ కార్యాలయానికి వెళ్తున్న ఉద్యోగులు ఇకపై రైల్వే డివిజనల్ మేనేజర్(డీఆర్‌ఎం)ను కలవాలంటే విజయవాడకు, జనరల్ మేనేజర్(జీఎం)ను కలవాలంటే విశాఖపట్నం వెళ్లాల్సి వస్తుంది. అలాగే, మధిర కేంద్రంగా పనిచేస్తున్న కొండపల్లి – మోటమర్రి సెక్షన్ పరిధి ఉద్యోగులను సికింద్రాబాద్ డివిజన్‌కు కేటాయించి, ఈ ప్రాంతానికి కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి ఉద్యోగులను కేటాయిస్తారని రైల్వేవర్గాల తెలిసింది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుగా ఉన్న నాలుగు స్టేషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ కేంద్రంగా ఏర్పడే కొత్త జోన్ పరిధిలోకి మారనున్న నేపథ్యాన ఉద్యోగులు, స్థానికులకు ఇక్కట్లు ఎదురుకాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేలా ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని పలువురు కోరుతున్నారు.
విశాఖ కేంద్రంగా ఏర్పాటుకానున్న
దక్షిణ కోస్తా రైల్వే జోన్
Comments
Please login to add a commentAdd a comment