●వరద తగ్గింది.. వారధి తేలింది | - | Sakshi
Sakshi News home page

●వరద తగ్గింది.. వారధి తేలింది

Published Sun, Feb 9 2025 1:02 AM | Last Updated on Sun, Feb 9 2025 1:03 AM

●వరద తగ్గింది.. వారధి తేలింది

●వరద తగ్గింది.. వారధి తేలింది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలో గోదావరి నదిపై ఉన్న దుమ్ముగూడెం ఆనకట్ట అశ్వాపురం – దుమ్ముగూడెం మండలాల మధ్య వారధిలా పనిచేస్తోంది. ఆనకట్ట పైనుంచి వర్షాకాలం మొదలు కొద్దిరోజుల కిందటి వరకు నీరు ప్రవహించింది. దీంతో జలపాతం మాదిరి కనిపించగా ఇప్పుడు గోదావరి నీటిమట్టం తగ్గడంతో ఆనకట్ట బయటపడి వారధిలా పనిచేస్తోంది. ఏటా ఈ ఆనకట్ట వేసవిలో వారధిలా, శీతాకాలంలో జలపాతంలా, వర్షాకాలంలో నీరు ఉప్పొంగుతూ కొత్త అందాలు సంతరించుకుంటుంది. అయితే, ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. – అశ్వాపురం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement