
కొలువు.. మాకిది సులువు..
● పట్టుబట్టారు.. ఉద్యోగాలు సాధించారు.. ● ఒకటికి మించి జాబ్‌లు కొల్లగొట్టిన యువత ● ఇప్పటికే ఉద్యోగాలు చేస్తూనే విజయకేతనం ఎగురవేసిన కొందరు ● గ్రూప్ 1, 2, 3కి తోడు జేఎల్‌గా ఎంపికై న పలువురు
యువత అనుకుంటే సాధించలేనిదేదీ లేదని, కొలువు కొట్టడం మాకెంతో సులువైన పని అని కొందరు నిరూపించారు. స్పష్టమైన లక్ష్యాలు ఉండడం లేదని, గాలివాటంగా వెళ్తున్నారని కొన్ని కుటుంబాల్లో పెద్దల నుంచి ఫిర్యాదులు వస్తున్నప్పటికీ ఇంకొందరు మాత్రం వాటిని పటాపంచలు చేస్తూ సత్తాచాటుతున్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్ – 1, 2, 3 ఫలితాలతోపాటు జూనియర్ లెక్చరర్లుగా ఎంపికై న వారిని పరిశీలిస్తే ఎంతో కఠోర శ్రమ.. పట్టుదల చూపించి.. ఉద్యోగాలు సాధించారని వెల్లడవుతోంది. స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకోవడమే కాక నిరంతరం శ్రమించడం, ఒక ఉద్యోగం వచ్చి నా పట్టు వీడకుండా మరిన్ని ఉద్యోగాలు సాధిస్తున్న యువత ఇంకొందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
●సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి..
తల్లాడ: మండలంలోని మల్లవరానికి చెందిన కటికి ఉపేంద్రకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చినా వదులుకుని ప్రభుత్వ ఉద్యోగం కోసం శ్రమించాడు. తాజాగా ఆయన గ్రూప్–3లో 384వ ర్యాంక్ సాధించాడు. ఆయన రెండేళ్ల వయస్సులోనే తండ్రి బాబూరావు ప్రమాదవశాత్తు మృతి చెందగా తల్లి ప్రోత్సాహంతో పట్టుదలగా చదివాడు. ఆయన 1 – 4వ తరగతి వరకు సాయిచైతన్య, 5 – 10వ తరగతి వరకు బాలభారతి విద్యాలయం, ఇంటర్ ఖమ్మం రెజొనెన్స్, బీటెక్ హైదరాబాద్‌లో పూర్తిచేశాడు. తల్లి సాయమ్మ ప్రోత్సాహంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఉపేంద్రను పలువురు అభినందిస్తున్నారు.

కొలువు.. మాకిది సులువు..
Comments
Please login to add a commentAdd a comment