
లోక్యాతండాలో ప్రారంభమైన హోలీ వేడుకలు
కూసుమంచి: అన్నిచోట్ల ఒకేరోజు హోలీ ఆడితే కూసుమంచి మండలం లోక్యాతండాలో మాత్రం మూడు రోజుల పాటు సందడి ఉంటుంది. ఈ మూడు రోజు లు తండావాసులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. మొదటిరోజైన శుక్రవారం కోలాటంతో వేడుకలు మొదలయ్యాయి. శనివారం తెల్లవారుజామున కామదహనం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం నుంచి తండాలో గత హోలీ నుంచి ఇప్పటి వరకు మగబిడ్డ పుట్టిన ఇంట డూండ్ వేడుక(అన్నప్రాసన, నామకరణం)లు నిర్వహించనున్నారు. ఇక మూడోరోజైన ఆదివారం తండావాసులు రంగులు చల్లుకోవడంతో వేడుకలు ముగిస్తాయి. ఇందులో పాల్గొనేందుకు ఉద్యోగ, వ్యాపార నిమిత్తం ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన తండావాసులే కాక బంధువులు రావడంతో స్థానికంగా సందడి నెలకొంది. కాగా, తొలి రోజు తండావాసులు గ్రామ కూడలిలో చేరి కోలాటమాడారు. చిన్నాపెద్ద తేడా లేకుండా పాల్గొని సంప్రదాయ తలపాగ, పంచెకట్టుతో ఆకట్టుకున్నారు.
మూడు రోజుల పాటు సాగనున్న సంబురాలు
Comments
Please login to add a commentAdd a comment