
●అన్నదమ్ములు.. ‘జాబ్’పాట్
కామేపల్లి: మండలంలోని గోవింద్రాలబంజరకు చెందిన గంగారపు సత్యనారాయణ – జ్యోతిర్మయి కుమారులు సాయికృష్ణమనాయుడు, రత్నేశ్వరనాయుడు ఏ పరీక్ష రాసినా విజయం సొంతమవుతోంది. గ్రూప్–1, 2, 3 ఫలితాల్లో అన్నదమ్ములు సత్తా చాటడం విశేషం. సాయికృష్ణమనాయుడు గ్రూప్–1లో 435 మార్కులు, గ్రూప్–3లో 578 ర్యాంక్ సాధించగా ఇప్పటికే డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇక రత్నేశ్వరనాయుడు గ్రూప్–1లో 467 మార్కులు, గ్రూప్–2లో 197వ ర్యాంక్, గ్రూప్–3లో 27వ ర్యాంక్ సాధించి వరుస విజయాలు కై వసం చేసుకున్నాడు. ఆయన ప్రసుత్తం సీటీఓలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment