నాడు కళ .. నేడు వ్యథ !
పచ్చని ఆకులు, పలు రకాల పూలతో ఓ పల్లె ప్రకృతి వనం కొద్ది నెలల క్రితం వరకు కళకళలాడింది. ప్రస్తుతం అందులో వృక్షాలన్నీ ఎండి హరిత కళ మాయమైంది. అశ్వారావుపేట మండలం పాత మామిళ్లవారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో నాలుగేళ్ల క్రితం పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయగా, వివిధ రకాల మొక్కలు నాటారు. ఈ మొక్కలు ఏపుగా పెరిగి మూడు నెలల క్రితం పచ్చని ఆకులు, వివిధ రకాల పుష్పాలతో ఆహ్లాదాన్ని పంచాయి. ఇటీవల ఎండలు పెరగడంతో పచ్చదనం మాయమై మొక్కలన్నీ మోడువారి కనిపిస్తున్నాయి.
– అశ్వారావుపేటరూరల్
నాడు కళ .. నేడు వ్యథ !
Comments
Please login to add a commentAdd a comment