
అన్ని కార్పొరేషన్ సంస్థలకు అభ్యర్థుల ఖరారు
ఖమ్మంవన్‌టౌన్: పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఖాళీగా ఉన్న అన్ని కార్పొరేషన్ సంస్థలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందని పీసీసీ పరిశీలకులు, వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, బత్తిన శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్‌లో పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అధ్యక్షతన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించగా వారు మాట్లాడారు. గ్రామ, మండల, పట్టణ, బ్లాక్‌స్థాయి కమిటీలకు సుమారు ఐదుగురు పేర్లతో ప్రతిపాదనలు పంపాలని, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసేవారి పేర్లనే సూచించాలని కోరారు. ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, మాలోత్ రాందాస్‌నాయక్, పోట్ల నాగేశ్వరరావు, మల్‌రెడ్డి రాంరెడ్డి, మన్నే సతీశ్, నాయుడు సత్యనారాయణ, రాయల నాగేశ్వరరావు, దొండపాటి వేంకటేశ్వరరావు, కొరివి వెంకటరత్నం, మహ్మద్ జావేద్, నాగండ్ల దీపక్‌చౌదరి, మేయర్ పునుకొల్లు నీరజ, ఫాతిమా ముక్తార్‌జోహర, కొత్తా సీతారాములు, దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్, వేజెండ్ల సాయికుమార్, సయ్యద్ ముజాహిద్‌హుస్సేన్, పుచ్చకాయల వీరభద్రం పాల్గొన్నారు.