
వైభవోపేతం.. కల్యాణోత్సవం
రెబ్బెన(ఆసిఫాబాద్): మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని రెబ్బెన మండలం గంగాపూర్‌లోని శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం నుంచి స్వామి వారి జాతర మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ముందుగా గర్భాలయంలోని వెంకన్న, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వేదపండితులు మండపానికి తీసుకువచ్చారు. ‘గోవిందా.. గోవిందా..’ అంటూ భక్తులు గోవింద నామస్మరణ చేశారు. అశేష భక్తజనం మధ్య వేదపండితుల మంత్రోచ్ఛరణలతో ఆలయం ఎదుట ఉన్న గంగాపూర్ వాగులో స్వామి వారి కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. అనంతరం గంగాపూర్ గ్రామకమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్వామి వారికి పట్టు వస్త్రాలు వచ్చాయి. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఏఎస్పీ చిత్తరంజన్, బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శ్రీనివాస్ టీటీడీ నుంచి వచ్చిన పట్టు వస్త్రాలను కల్యాణ మండపం వరకు తీసుకువచ్చి స్వామి వారికి సమర్పించారు. టీటీడీ నుంచి స్వామి వారి కంకణాలు, తీర్థప్రసాదాలను భక్తులకు అందించారు.
నేడు స్వామి వారి రథోత్సవం
రెండో తిరుపతిగా పేరు గాంచిన గంగాపూర్ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘ శుద్ధ పౌర్ణమి రోజు తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు రెండు గడియల పాటు ఇక్కడ భక్తులకు దర్శనమిస్తారని ప్రగాఢ నమ్మకం. మాఘశుద్ధ పౌర్ణమి బుధవారం సాయంత్రం 6.15 నిమిషాలకు గంగాపూర్‌వాగులో స్వామి వారి రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు దాదాపు 1.5 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు జాతర ఏర్పాట్లను ఏఎస్పీ చిత్తరంజన్ పర్యవేక్షించారు. మండల కేంద్రంలోని రైల్వేగేట్ వద్ద వాహనాల రాకపోకలు, ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి వెంట ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా బందోబస్తు పరిశీలించారు. జాతర జరిగే ప్రాంతం లోపలికి వాహనాలను అనుమతించవద్దని సూచించారు. వాహనాలు పార్కింగ్ స్థలాల్లో నిలిపేవిధంగా చూడాలని ఆదేశించారు.
స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులు
బాలాజీ వేంకటేశ్వర స్వామి వారిని ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, జిల్లా నాయకులు జువ్వాజీ అనిల్‌గౌడ్, తహసీ ల్దార్ రామ్మోహన్‌రావు, ఎంపీడీవో శంకరమ్మ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లావుడ్య రమే శ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవాజీ, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ పల్లె ప్రకాశ్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ కార్నాథం సంజీవ్‌కుమార్, నాయకులు కొవ్వూరి శ్రీనివాస్, గుంపుల విమలేష్ తదితరులు దర్శించుకున్నారు.
కనుల పండువగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
ఘనంగా మొదలైన గంగాపూర్ జాతర
నేడు స్వామి వారి రథోత్సవం

వైభవోపేతం.. కల్యాణోత్సవం

వైభవోపేతం.. కల్యాణోత్సవం

వైభవోపేతం.. కల్యాణోత్సవం

వైభవోపేతం.. కల్యాణోత్సవం
Comments
Please login to add a commentAdd a comment