ఆసిఫాబాద్‌అర్బన్: ఎండల తీవ్రత నేపథ్యంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ముందస్తు కార్యాచరణ ప్రారంభించామని ఆసిఫాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ రాథోడ్ శేషారావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 10న 15,998 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదు కాగా, ఆసిఫాబాద్ సర్కిల్ పరిధిలో 1.68 మిలియన్ యూనిట్లు నమోదైందని తెలిపారు. రానున్న మూడు నెలల్లో కూడా గణనీయంగా విద్యుత్ డిమాండ్ పెరిగే అంచనాల ప్రకారం వేసవి కార్యాచరణ, ప్రణాళిక సిద్ధం చేసి అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 187 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని, 86 ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం కూడా పెంచుతామని తెలిపారు. సబ్ స్టేషన్లలో ఆరు అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు నెలకొల్పుతామని, రెండు పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం కూడా పెంచుతామని వివరించారు. ప్రకృతి వైపరీత్యాలు, మెయింటనెన్స్ సమయాల్లో, ఇతర కారణాలతో వినియోగదారులకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు 21.26 కేఎంల ఇంటర్ లింకింగ్ లైన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొత్త ఫీడర్లు ఏర్పాటు చేసి, ఫిబ్రవరి చివరివరకు పెండింగ్ పనులు పూర్తిచేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment