
వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా రోడ్డు నిర్మాణం
తిర్యాణి(ఆసిఫాబాద్): వన్యప్రాణుల సంచా రానికి ఇబ్బంది లేకుండా రోడ్డు నిర్మాణం చేపట్టాలని పీసీసీఎఫ్ ఏలుసింగ్ మేరు అన్నా రు. తిర్యాణి మండలం రొంపెల్లి నుంచి గుండాల గ్రామం వరకు నూతనంగా నిర్మిస్తున్న ప్రాంతాన్ని మంగళవారం సీఎఫ్ శాంతారాంతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడు తూ వన్యప్రాణులు అటవీప్రాంతంలో స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు వీలుగా రోడ్డు మధ్యలో ఒకచోట పాస్ ఎగో వంతెన నిర్మించాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికా రులకు సూచించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచి వీలయినంత త్వరగా అందుబాటులో కి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్, మంచిర్యాల డివిజన్ ఫారెస్టు అధి కారులు సుశాంత్, సుఖ్‌దేవ్, విశ్వనాథ్, వేణుబాబు, తిర్యాణి రేంజ్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment