ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి
తిర్యాణి(ఆసిఫాబాద్): ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉద్దవ్ అన్నారు. మండలంలోని పంగిడిమాదర ఆశ్రమ పాఠశాలలో మంగళవారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు వచ్చే లా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. టీచర్లు విధులకు సకాలంలో హాజరై లొకేషన్‌తో కూడిన సెల్ఫీ ఫొటో పంపించాలన్నారు. పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. మెనూ ప్రకా రం మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. ఈ సమావేశంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం సాగర్, ఎస్‌ఈఆర్పీ వెడ్మ యశ్వంత్‌రావు, హెచ్‌ఎంలు నైతం కృష్ణారావు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment