బెజ్జూర్ మండలం ఏటిగూడ గ్రామానికి చెందిన ఎర్నాగి చిన్నయ్య జనవరి 16న అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పత్తి చేనులో పూడ్చిపెట్టారు. 28వ తేదీన మౌని అమావాస్య సందర్భంగా గుప్త నిధులు తవ్వకం కోసం చిన్నయ్య సమాధి వద్ద ఐదుగురు వ్యక్తులు క్షుద్ర పూజలు చేసి మృతదేహం ఐదు ఎముకలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎస్సై ప్రవీణ్‌కుమార్ విచారణ చేపట్టి బెజ్జూర్ మండలం గొల్లవాడకు చెందిన ఇనుగుర్తి రమేశ్, గబ్బాయికి చెందిన ఆత్రం శంకర్, ఏటిగూడకు చెందిన గెడెం రావుజీ, కరీంనగర్ జిల్లా రాంనగర్‌కు చెందిన కాసరపు పరమేశ్వర్, రామమడుగు మండలం కొక్కెరకుంట గ్రామానికి చెందిన గొల్ల రాజుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment