షరతులు లేకుండా పత్తి కొనుగోలు చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఎలాంటి షరతులు లేకుండా రైతుల నుంచి పత్తి పంట కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోట శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం రైతులు నిర్వహించిన నిరసనకు సీపీఎం మద్దతు ప్రకటించింది. నాయకులు మాట్లాడుతూ ఆసిఫాబాద్‌లోని మార్కెటింగ్ అధికారులు ప్రైవేట్ వ్యాపారులతో కుమ్మకై ్క పత్తి కొనుగోళ్లలో ఆంక్షలు పెడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం నుంచి సర్వర్ డౌన్ ఉందనే పేరుతో కొనుగోళ్లు నిలిపివేశారన్నారు. అద్దె వాహనాల్లో పత్తి పంటను తీసుకువచ్చిన రైతులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. అలాగే స్థానిక మిల్లుల్లో 1500 క్వింటాళ్ల వరకే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. షరతులు లేకుండా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ డేవిడ్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో రైతులు, నాయకులు పెంటయ్య, నితిన్, మహదు, గోపాల్, పోచన్న, సాయి, కిరణ్, వెంకటేశ్, వినోద్, ముస్తాఫా, దత్తు తదతరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment