వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
కెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థులు వందశా తం ఉత్తీర్ణత సాధించాలని ఐటీడీఏ డీడీ పి.రమాదేవి అన్నారు. మండలంలోని హట్టి, రాంజీగూడ ఆశ్రమ ఉన్నత పాఠశాలలతోపాటు రాంజీగూడలోని ప్రాథమిక పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. వంటగదులు, స్టోర్ రూంలు పరిశీలించారు. సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం 9, 10వ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. మెరుగైన ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులు శ్రమించాలన్నారు. ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ, చదువులో వెనుకబడిన వారిపై దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. రాంజీగూడ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులతో ఇంగ్లిష్, తెలుగు పుస్తకాలు చదివించారు.
Comments
Please login to add a commentAdd a comment