తేలిన ‘స్థానికం’ లెక్క!
● మండలాల వారీగా ఓటరు జాబితా విడుదల
● ఎంపీటీసీ స్థానాల సంఖ్య సైతం..
● ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం!
జిల్లా వివరాలు
మండలం ఎంపీటీసీ స్థానాలు పంచాయతీలు వార్డులు ఓటర్లు
ఆసిఫాబాద్ 11 27 236 30,462
బెజ్జూర్ 8 22 188 23,843
చింతలమానెపల్లి 8 19 176 23,991
దహెగాం 8 24 200 22,072
జైనూర్ 9 26 222 24,339
కాగజ్‌నగర్ 15 28 266 45,354
కెరమెరి 9 31 250 24,032
కౌటాల 9 20 182 27,304
లింగాపూర్ 5 14 112 10,583
పెంచికల్‌పేట్ 5 12 102 12,482
రెబ్బెన 10 24 214 28,913
సిర్పూర్(టి) 8 16 144 22,209
సిర్పూర్(యూ) 5 15 124 12,306
తిర్యాణి 7 29 222 18,149
వాంకిడి 10 28 236 28,652
మొత్తం 127 335 2,874 3,54,691
ఎన్నికల నిర్వహణకు సిద్ధం
స్థానిక సంస్థల ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పిస్తున్నాం. పోలింగ్‌కు సంబందించిన సామగ్రి కూడా జిల్లాకు చేరుకుంది. రిటర్నింగ్ అధికారుల నియామక ప్రక్రియ పూర్తి చేసి వారికి శిక్షణ ఇవ్వనున్నాం.
– భిక్షపతిగౌడ్, డీపీవో
ఆసిఫాబాద్‌అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. సర్పంచుల పదవీ కాలం పూర్తయి ఏడాది దాటింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీ కాలం పూర్తయి కూడా ఏడు నెలలు ముగిశాయి. ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. జిల్లా అధికారులు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసిన హైదరాబాద్‌లో శిక్షణ అందించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి కూడా జిల్లాకు చేరుకుంది. ఎంపీటీసీ స్థానాలు, పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రకటించారు. తాజాగా సోమవారం మండలాల వారీగా ఓటరు జాబితాను విడుదల చేసి ఆయా మండలల్లో ప్రదర్శించారు. అయితే ఎన్నికల నిర్వహణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో మరోసారి కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వేషన్లపై స్పష్టత వచ్చిన తర్వాతే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
3,54,691 మంది ఓటర్లు
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం మండలాల వారీగా ఓటరు జాబితాను జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ సోమవారం విడుదల చేశారు. ఆయా మండలాల్లోనూ ఎంపీడీవో ఓటరు జాబితాను కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. జిల్లాలో 15 మండలాల్లో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 2,874 వార్డులు, 127 ఎంపీటీసీ స్థానాలు, 15 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 3,54,691 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,77,105 మంది కాగా, మహిళా ఓటర్లు 1,77,567, ఇతరులు 19 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment