● పెద్దల అంగీకారంతో వివాహం మేలు ● అర్థం చేసుకునే భాగస్వామి ఉంటే లైఫ్‌ అంతా హ్యాపీ ● ప్రేమికుల రోజు సందర్భంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ‘సాక్షి’ డిబేట్‌ | - | Sakshi
Sakshi News home page

● పెద్దల అంగీకారంతో వివాహం మేలు ● అర్థం చేసుకునే భాగస్వామి ఉంటే లైఫ్‌ అంతా హ్యాపీ ● ప్రేమికుల రోజు సందర్భంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ‘సాక్షి’ డిబేట్‌

Published Fri, Feb 14 2025 10:53 PM | Last Updated on Fri, Feb 14 2025 10:49 PM

● పెద

● పెద్దల అంగీకారంతో వివాహం మేలు ● అర్థం చేసుకునే భాగస్వ

లక్ష్యాన్ని ప్రేమించండి..

మీ చుట్టూ ఉన్న అందరూ ప్రేమిస్తున్నారని.. మీరు ప్రేమించడం సరికాదు. జీవితం ఒక ప్రయాణంలాంటింది. సినిమాలు చూసో.. ఆకర్షణతోనో ప్రేమిస్తే నష్టపోవాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి మనస్సును అర్థం చేసువాలి. లక్ష్యాన్ని ప్రేమించండి.. జీవితంలో స్థిరపడేందుకు కష్టపడండి. – శారద, ప్రిన్సిపాల్‌

వేగంగా విడాకుల వైపు..

ప్రస్తుతం సమాజంలో ప్రే మ పెళ్లిలు పెరిగాయి. అ యితే అంతే వేగంగా విడాకుల వైపు వెళ్తున్నారు. ఒకరిపై ఒకరికి నమ్మకం లేక.. అనుమానాలతో గొడవలు పెరుగుతున్నాయి. ఒకరినొకరు అర్థం చే సుకున్న తర్వాతే వివాహ బంధంలోకి అడుగుపెట్టాలి.

– తేజశ్రీ, ఎంపీసీఎస్‌ ఫైనలియర్‌

ఆసిఫాబాద్‌రూరల్‌: తరాలు మారుతున్నా ప్రేమకు ఉన్న భావన ఒక్కటే.. ప్రేమతో కలిసి.. పెళ్లి బంధంతో ఒక్కటై జీవితాన్ని సార్థకం చేసుకున్న వారెందరో.. తల్లిదండ్రుల అంగీకారంతో నచ్చిన మనిషిని జీవితంలోకి ఆహ్వానించి సంతోషంగా జీవిస్తున్నారు. అయితే నేటి కాలంలో కొన్ని బంధాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. యుక్త వయస్సులో ఆకర్షణతో కలిగే ప్రేమలు గమ్యం చేరడం లేదు. కడదాక కలిసి ఉండలేక తల్లిదండ్రులు, కుటుంబాలను సైతం చిక్కుల్లోకి నెడుతున్నారు. వాలంటైన్స్‌ డే సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం ‘సాక్షి’ డిబేట్‌ నిర్వహించింది. ‘ప్రేమికులు తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటే జీవితం సాఫీగా సాగుతుంది.. ప్రేమకు పెద్దల అంగీకారం తోడైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమిస్తే.. అందరినీ మెప్పించాలి..’ అంటూ విద్యార్థినులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. లవ్‌ అనేది రెండు కుటుంబాలను కలిపేలా ఉండాలని వారు స్పష్టం చేశారు.

కలిసి ఉంటేనే ప్రేమించాలి

ప్రేమ పేరుతో మోసాలు పెరిగాయి. ప్రేమ పేరుతో టైంపాస్‌ చేసి తర్వాత విడిపోవడం సరికాదు. జీవితకాలం కలిసి ఉంటేనే ప్రేమించుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. అలా అయితే జీవితాంతం సంతోషంగా ఉంటారు.

– సాయిప్రియ, బీజెడ్‌సీ సెకండియర్‌

సర్దుకుపోతే.. సమస్యలుండవ్‌

ప్రేమ పెళ్లయినా.. పెద్దలు కుదిర్చిన వివాహమైనా సర్దుకుపోతే ఎలాంటి సమస్యలు ఉండవు. ప్రేమ విషయంలో లింగ వివక్షత చూపొద్దు. కుమారుడు అయితే ఒకలా.. కుమార్తె అయితే ఒకవిధంగా స్పందించొద్దు. యువత కూడా కనిపెంచిన తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి.

– అయ్యుబాయి, ఎంపీసీఎస్‌ ఫైనలియర్‌

లక్ష్యానికి అడ్డు కావొద్దు

చదువుకునే సమయంలో ఉన్నత లక్ష్యంతో ఉండాలి. యుక్త వయస్సులో కలిగే ఆకర్షణతో ప్రేమ అంటూ సమయం వృథా చేసుకోవద్దు. లక్ష్యానికి ఏదీ అడ్డురాకుండా చూసుకోవాలి. సమయం వృథా అయితే తిరిగి రాదు. చదువుకునే సమయంలో ప్రేమకు దూరంగా ఉండటమే ఉత్తమం.

– శ్రీదేవి, బీజెడ్‌సీ సెకండియర్‌

అనుమానాలు తొలగించాలి

ప్రేమ ఇద్దరు వ్యక్తులకు సంబంధించినది అయితే.. పెళ్లి మాత్రం రెండు కుటుంబాలకు సంబంధించింది. అందుకే యువతీయువకులు కుటుంబాలను ఒప్పించే ప్రయత్నం చేయాలి. వారికి ఉన్న అనుమానాలు తొలగించాలి. జీవితంలో ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ప్రేమ, పెళ్లి విషయాలపై దృష్టి సారించాలి. అప్పుడే ఎలాంటి గొడవలు లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది.

– సుహాసిని, బీజెడ్‌సీ సెకండియర్‌

సోషల్‌ మీడియా ప్రభావం

ప్రస్తుతం మొబైల్‌ ఫోన్ల వాడకం పెరిగింది. యువతపై సోషల్‌ మీడియా ప్రభావం అధికంగా ఉంది. చదువు ద్వారానే ఉన్నత శిఖరాలకు చేరుకోగలం. ప్రేమ వివాహామైనా తల్లిదండ్రులను ఒప్పించాలి. అందరినీ ఒప్పిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురైనా అండగా నిలుస్తారు.

– అశ్విని, ఎంపీసీఎస్‌ ఫైనలియర్‌

‘సాక్షి’ డిబేట్‌లో పాల్గొన్న విద్యార్థినులు, అధ్యాపకులు

No comments yet. Be the first to comment!
Add a comment
● పెద్దల అంగీకారంతో వివాహం మేలు ● అర్థం చేసుకునే భాగస్వ1
1/7

● పెద్దల అంగీకారంతో వివాహం మేలు ● అర్థం చేసుకునే భాగస్వ

● పెద్దల అంగీకారంతో వివాహం మేలు ● అర్థం చేసుకునే భాగస్వ2
2/7

● పెద్దల అంగీకారంతో వివాహం మేలు ● అర్థం చేసుకునే భాగస్వ

● పెద్దల అంగీకారంతో వివాహం మేలు ● అర్థం చేసుకునే భాగస్వ3
3/7

● పెద్దల అంగీకారంతో వివాహం మేలు ● అర్థం చేసుకునే భాగస్వ

● పెద్దల అంగీకారంతో వివాహం మేలు ● అర్థం చేసుకునే భాగస్వ4
4/7

● పెద్దల అంగీకారంతో వివాహం మేలు ● అర్థం చేసుకునే భాగస్వ

● పెద్దల అంగీకారంతో వివాహం మేలు ● అర్థం చేసుకునే భాగస్వ5
5/7

● పెద్దల అంగీకారంతో వివాహం మేలు ● అర్థం చేసుకునే భాగస్వ

● పెద్దల అంగీకారంతో వివాహం మేలు ● అర్థం చేసుకునే భాగస్వ6
6/7

● పెద్దల అంగీకారంతో వివాహం మేలు ● అర్థం చేసుకునే భాగస్వ

● పెద్దల అంగీకారంతో వివాహం మేలు ● అర్థం చేసుకునే భాగస్వ7
7/7

● పెద్దల అంగీకారంతో వివాహం మేలు ● అర్థం చేసుకునే భాగస్వ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement