మహిళా సంఘాలకు ‘ఉపాధి’ పనులు
కెరమెరి(ఆసిఫాబాద్): ఉపాధిహామీ పథకంలో ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేసి మహిళా సంఘాల సభ్యులకు పనులు కల్పిస్తున్నట్లు డీఆర్‌డీవో దత్తారావు అన్నారు. మండలంలోని బారేమోడి, ఝరి గ్రామాల్లో మహిళా శక్తి భరోసా కింద చేపట్టిన ఉపాధిహామీ పనులను గురువారం పరిశీలించారు. కూలీలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మహిళలకు కల్పించిన పనులు వారే చేయాలని సూ చించారు. అవసరం మేరకు పనులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని, జాబ్‌కార్డు కలి గిన వారు వినియోగించుకోవాలన్నారు. ప్రతీ కుటుంబం వందరోజుల పనిదినాలు పూర్తిచేసుకోవాలన్నారు. ఆయన వెంట ఈసీ ఐక్యానాయక్, టీఏ అరవింద్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment