ఇటిక్యాల పహాడ్‌లో శిక్షణ అధికారుల పర్యటన
సిర్పూర్(టి): హైదరాబాద్‌లోని దూలపల్లి తెలంగాణ అటవీ అకాడమీలో శిక్షణ పొందుతున్న సెక్షన్ అధికారులు గురువారం సిర్పూర్(టి) రేంజ్ పరిధిలోని ఇటిక్యాల పహాడ్ అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఉప సంచాలకుడు, ఎఫ్‌ఆర్‌వో మోహన్‌రావు ఆధ్వర్యంలో ఇటిక్యాల పహాడ్‌లోని ప్లాంటేషన్‌లో అడవుల సంరక్షణ, ఆవశ్యకత గురించి తెలు సుకున్నారు. పెద్దపులి కదలికలు, ఆవాస ప్రాంతాలను పరిశీలించారు. పెద్దపులి ఆవా సం కోసం ఏర్పాటు చేసిన నీటికుంటలు, డ్యాంలు గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీట్ అధికారి సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment