కౌటాల(సిర్పూర్): మండలంలోని తాటిపల్లి గ్రామ సమీపంలోని వార్దా నది ఒడ్డున గల శ్రీసిద్ధి హనుమాన్ ఆలయంలో నిర్వహించనున్న మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. సిర్పూర్(టి)లో గురువారం ఎమ్మెల్సీ దండె విఠల్‌ను కలిసి ఆలయ కమిటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ నెల 24 నుంచి 28 వరకు ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ జాతర సందర్భంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, నాయకులు ఎల్ములే దత్తు, బొమ్మకంటి మహేశ్, సంతోష్, సంపత్, దివాకర్, ప్రవీణ్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment