నూతన కార్యవర్గం ఎన్నిక
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసంలో గురువారం తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామేశ్వరరావు సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షురాలిగా ఎమ్మె ల్యే కోవ లక్ష్మి, సలహాదారులుగా వెంకటేశ్వర్లు, సతీశ్‌బాబు, జిల్లా అధ్యక్షుడి సుధాకర్, ఉపాధ్యక్షులుగా వెంకటస్వామి, నర్సింహాచారి, వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ, సహాయ కార్యదర్శులుగా భాస్కర్, వెంకటేశ్, నిర్వాహక కార్యదర్శిగా మధుకర్, కోశాధికారి స్వరూప, సభ్యులుగా సుభాష్, కిరణ్, బాపు, నారాయణ, మల్లేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment