ముగిసిన గంగాపూర్ జాతర
రెబ్బెన(ఆసిఫాబాద్): మండలంలోని గంగాపూర్‌లో నిర్వహిస్తున్న శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి జాతర మహోత్సవం గురువారం ముగిసింది. మూడురోజులపాటు జాతర అంగరంగ వైభవంగా సాగింది. గతానికి భిన్నంగా ఈసారి చివరిరోజు కూడా వందలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసరాలు, దుకాణాల వద్ద సందడి నెలకొంది. అలంకరణ వస్తువులు, చిన్నపిల్లలకు ఆటబొమ్మలు, వంటపాత్రలు కొనుగోలు చేసి భక్తులు ఇళ్లకు తిరుగుపయనమన్నారు. సుమారు 1.5 లక్షల పైచికులు మంది స్వామి వారిని దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారులు, పోలీసులు అంచనా వేశారు. చివరిరోజు ఏఎస్పీ చిత్తరంజన్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జాతర బందోబస్తు ఏర్పాట్లను ఏఎస్పీ పరిశీలించారు. సమర్ధవంతంగా విధులు నిర్వహించారని రెబ్బెన సీఐ బుద్దెస్వామి, రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్, తిర్యాణి ఎస్సై ఎంబడి శ్రీకాంత్‌ను అభినందించారు. మాజీ జెడ్పీటీసీ వేముర్ల సంతోష్, నంబాల మాజీ సర్పంచ్ చెన్న సోమశేఖర్, ఆలయ కమిటీ చైర్మన్ లెండుగూరే జయరాం, కాంగ్రెస్ నాయకులు ఎర్రం తిరుపతి తదితరులు వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
● చివరిరోజూ కొనసాగిన భక్తుల రద్దీ
ముగిసిన గంగాపూర్ జాతర
ముగిసిన గంగాపూర్ జాతర
Comments
Please login to add a commentAdd a comment