పాఠశాలలు తనిఖీ
కాగజ్‌నగర్‌రూరల్: మండలంలోని నజ్రూల్‌నగర్ విలేజ్ నం.3 పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను గురువారం డీఈవో గమానియల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు, స్లిప్‌టెస్ట్‌ల నివేదికలను పరిశీలించారు. ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థులను వివిధ సబ్జెక్టులకు సంబంధించి ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అనంతరం పెట్రోల్‌పంపు జెడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం మండల విద్యావనరుల కేంద్రంలో నిర్వహిస్తున్న భవిత పాఠశాలను సందర్శించారు. కార్యక్రమంలో ఎంఈవో వాసాల ప్రభాకర్, ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment