నీటి యాజమాన్యం కీలకం
● డీఏవో శ్రీనివాసరావు
ఆసిఫాబాద్‌అర్బన్: పంటల సాగులో నీటి యాజమాన్యం కీలకమని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. నీరు, భూమి యాజమాన్య శిక్షణ, పరిశోధన సంస్థ(వాలంటరీ) హిమాయత్‌సాగర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నీటి సంరక్షణ యాజమాన్యంపై జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతువేదికలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతులు సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించాలన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి మాట్లాడుతూ తక్కువ నీటి వినియోగం కోసం బిందు, తుంపర్ల సేద్యం విధానాలు పాటించాలన్నారు. వాలంటరీ వ్యవసాయ అధికారి అన్నపూర్ణ మాట్లాడుతూ రైతులు పంచగవ్వ శివామృతం, పచ్చిరొట్ట వంటి ఎరువులు వాడాలన్నారు. కార్యక్రమంలో అదనపు వ్యవసాయ సంచాలకుడు మిలింద్‌కుమార్, ఏఈవోలు వెంకటేశ్, చిరంజీవి, హనుమాన్, రాము, రైతులు తదితరులు పాల్గొన్నారు.
భూసంరక్షణ పద్ధతులు అవలంబించాలి
కాగజ్‌నగర్‌రూరల్: రైతులు భూసంరక్షణ పద్ధతులు అవలంబించాలని డీఏవో శ్రీనివాసరావు అన్నా రు. మండలంలోని వంజీరి రైతువేదికలో గురువా రం నీరు, భూమి యాజమాన్య శిక్షణ, పరిశోధన సంస్థ(వాలంటరీ) ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సేంద్రీయ వ్యవసాయం, ఆయిల్‌పాం తోటల్లో నేల, నీటి సంరక్షణ పద్ధతులు, డ్రిప్ ఇరిగేషన్, నీటి కుంటలు, మల్చింగ్ విధానంతో కలి గే ప్రయోజనాలపై శిక్షణ ఇచ్చారు. వాలంటరీ సహాయ వ్యవసాయాధికారి సునీత, అన్నపూర్ణ, ఏడీఏ మనోహర్, ఏవో రామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment