సమస్యల పరిష్కారానికి ఐక్యపోరాటం
బెజ్జూర్(సిర్పూర్): సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాటం సాగించాలని మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్‌రావు అన్నారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రీబాయి పూలే ఆశయాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాలీలు ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా బీజేపీ ఎస్టీ హోదా కోసం పోరాటం చేయడం లేదని విమర్శించారు. మాలీలకు ఎస్టీ హోదా కల్పించే వరకు తమ పోరాటం ఆగదన్నారు. టీపీసీసీ సభ్యుడు అర్షద్ హుస్సేన్, మాలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె.రామకృష్ణ, నాయకులు మోహన్, అశోక్, నందయ్య, ఆదే వసంతరావు, శ్రీనివాస్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment