వందశాతం పన్నులు వసూలు చేయాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి
ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో వందశాతం పన్నులు వసూలు చేయాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం మున్సిపల్ కమిషనర్ భుజంగ్‌రావుతో కలిసి పన్ను వసూళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్ పన్నులు వెంటనే వసూలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టాలన్నారు. ఈ క్రమంలో అధికారులు, సిబ్బందికి పన్ను వసూళ్లపై సూచనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment