పక్కాగా పంటల లెక్క!
● జిల్లావ్యాప్తంగా మొదలైన డిజిటల్ సర్వే ● పైలెట్ ప్రాజెక్టు కింద 1.24 లక్షల ఎకరాల వివరాలు సేకరణ ● క్షేత్రస్థాయిలో వివరాల నమోదుకు 66 మంది సిబ్బంది
దహెగాం(సిర్పూర్): క్రాప్ బుకింగ్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పంటల డిజిటల్ నమోదు సర్వే చేపట్టా రు. ఎన్ని ఎకరాల్లో.. ఏయే పంటలు సాగు చేస్తున్నా రు.. ఎంత దిగుబడి వస్తుంది.. అనే వివరాలు తెలు సుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడనుంది. అలాగే రైతులు సాగుచేసిన పంటలు మార్కెట్‌లో విక్రయించుకోవడానికి సైతం వీలవుతుంది. అన్నదాతలు దళారులతో మోసపోకుండా దిగుబడి అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన సర్వే జిల్లాలో ప్రస్తుతం జోరుగా కొనసాగుతోంది. ఒక వ్యవసాయ క్లస్టర్ పరిధిలో సుమారు రెండు వేల ఎకరాలకు తగ్గకుండా వివరాలు సేకరిస్తున్నారు.
పైలెట్ ప్రాజెక్టు కింద 1.24 లక్షల ఎకరాలు..
జిల్లాలో వానాకాలం సీజన్‌లో 4.50 లక్షల ఎకరా లు, యాసంగిలో 50 వేల ఎకరాల్లో పంటలు సాగువుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలో 1.24 లక్షల ఎకరాలను డిజిటల్ సర్వే చేయాలని ఆదేశించింది. ఈ నెల 3 నుంచి మండలాల్లోని గ్రామాలను క్లస్టర్లుగా ఎంపిక చేసుకుని.. ఒక్కో క్లస్టర్ పరిధిలో వ్యవసాయ అధికారులు 1,800 నుంచి 2000 ఎకరాల వరకు వివరాలు సేకరిస్తున్నారు. వ్యవసాయశాఖ జిల్లాల్లో సర్వే కోసం 66 మంది సిబ్బందిని కేటాయించింది. ఇదివరకు చే సిన పంటల నమోదులో సిబ్బంది క్షేత్రస్థాయిలో వెళ్లకుండా, కేవలం రైతుల వద్ద సేకరించిన వివరా లనే నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్ర స్తుతం సిబ్బంది తప్పనిసరిగా పంట పొలం వద్దకు వెళ్లాల్సి ఉంది. ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు వేశారో క్షేత్రస్థాయికి వెళ్లి ఫొటో తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. జిల్లాల్లో పంటల సాగు పూర్తి సమాచారం ప్రభుత్వానికి నివేదించనున్నారు.
రైతులకు మేలు
డిజిటల్ సర్వే చేయడంతో పంట దిగుబడులు అమ్ముకోవడానికి రైతులకు ఇబ్బందులు ఉండవు. జిల్లాలో సాగు వివరాలు పూర్తిస్థాయిలో వెల్లడవుతాయి. పంటలు, దిగుబడి అంచనాలు రూపొందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ఒకే పంట కాకుండా ఇతర పంటల సాగుకు అవగాహన కల్పిస్తారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు వీలవుతుంది. అలాగే సాగు భూములకు పట్టాలు లేని వాటి వివరాలను ప్రత్యేకంగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తున్నారు. సర్వే పూర్తిచేసేందుకు తుది గడువు లేదని అధికారులు పేర్కొంటున్నారు.
సిగ్నల్స్ లేనిచోట ఇబ్బందులు
జిల్లాలో డిజిటల్ పంటల సర్వే ఈ నెల 3 నుంచి ప్రారంభమైంది. పైలెట్ ప్రాజెక్టు కింద 1.24 లక్షల ఎకరాల వివరాలు సేకరించేందుకు 66 మంది సిబ్బందిని నియమించాం. ప్రతీ క్లస్టర్‌లో 18 వందల ఎకరాలకు తగ్గకుండా సర్వే చేస్తున్నాం. సిగ్నల్ లేనిచోట్ల మాత్రమే ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
– శ్రీనివాస్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి
సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు
జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ సర్వేకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వ్యవసాయ విస్తరణ అధికారులు నేరుగా పంట చేల దగ్గరికి వెళ్లాలి. ప్రతీ సర్వే నంబర్‌లో సాగు చేసిన పంట ఫొటో తీసి అక్కడి నుంచే వ్యవసాయశాఖ రూపొందించిన ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఎక్కడో ఉండి, ఎవరి పొలమో ఫొటో తీసి అప్‌లోడ్ చేయడం కుదరదు. సర్వే చేసే పొలానికి సంబంధించిన సర్వే నంబరు 25 మీటర్ల పరిధి వరకే యాప్ పనిచేస్తుంది. జిల్లాలో మారుమూల గ్రామాలకు సిగ్నల్ సమస్య వెంటాడుతుంది. చాలా గ్రామాల్లో సిగ్నల్ లేనందున డిజిటల్ సర్వేకు ఆటంకం ఏర్పడుతుంది. అలాగే సాగులో ఉన్నప్పటికీ దానికి సంబంధించిన పట్టా లేకపోవడంతో సమస్యగా మారుతోందని అధికారులు పేర్కొంటున్నారు. సాగుకు యోగ్యంగా లేని భూములను కూడా ఈ సర్వే ద్వారా గుర్తిస్తున్నారు. డిజిటల్ సర్వేకు వెళ్లిన వ్యవసాయాధికారులు పంటల పొలాల వద్దకు వెళ్లిన సమయంలో సిగ్నల్ లేకపోతే.. ఫొటో తీసుకుని సిగ్నల్ ఉన్నచోటకు వద్దకు వచ్చి అప్‌లోడ్ చేస్తున్నామని చెబుతున్నారు. పూర్తిగా సిగ్నల్ లేని ఏరియాల్లో శాటిలైట్ ద్వారా డిజిటల్ సర్వే చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు.
పక్కాగా పంటల లెక్క!
Comments
Please login to add a commentAdd a comment