‘పీఎం శ్రీ’ పనుల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో పీఎం శ్రీ పథకానికి ఎంపికై న పాఠశాలల్లో చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి పీఎం శ్రీ పథకానికి ఎంపికై న పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 18 ప్రభుత్వ పాఠశాలలు పీఎం శ్రీ పథకానికి ఎంపికయ్యాయని తెలిపారు. మార్చిలోగా వందశాతం పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. విద్యార్థుల సౌకర్యార్థం మూత్రశాలలు, ప్రత్యేక తరగతి గదులు, ప్రహరీలు, సైన్స్ ల్యాబ్‌లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని, కరాటేలో శిక్షణ అందించాలన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి సిద్ధంగా ఉంచాలన్నారు. ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులు పనులను నిరంతరం పరిశీలించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్‌వో అబిద్ అలీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment