గంగాపూర్ జాతర ఆదాయం రూ.44.07 లక్షలు
రెబ్బెన(ఆసిఫాబాద్): గంగాపూర్‌లోని శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి జాతర హుండీని శుక్రవారం లెక్కించగా, రూ.44.07 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో బాపిరెడ్డి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో చీఫ్ ఫెస్టివల్ అధికారి వేణుగోపాల్ గుప్తా, ఈవో బాపిరెడ్డి పర్యవేక్షణలో హుండీ లెక్కింపు చేపట్టారు. వేలం ద్వారా రూ.20.29 లక్షలు, జాతర ద్వారా టికెట్ల విక్రయం ద్వారా రూ.7.12లక్షలు, కేశ ఖండనం టికెట్ల ద్వారా రూ.4,880, స్వామి వారి కల్యాణం ద్వారా రూ.12,276, కల్యాణం కట్నాల ద్వారా రూ.46,770తో పాటు హుండీ ద్వారా రూ. 16.01 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. మొత్తంగా జాతర ద్వారా ఆలయానికి రూ.44.07 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి జాతర ద్వారా ఆలయానికి రూ.7.73 లక్షల అదనపు ఆదాయం సమకూరినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment