ఘనంగా విగ్రహ వార్షికోత్సవం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో పెద్దవా గు సమీపంలోని శ్రీఅభయాంజనేయ స్వామి విగ్రహ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించా రు. ఆలయ అర్చకులు శిరీష్‌శర్మ, నారాయణమూర్తి, విజయ్‌కుమార్ శర్మ, సూర్యనారాయణ, మహేశ్‌శర్మ ఆధ్వర్యంలో స్వామి వారికి గణపతి, గౌరీపూజ, స్వస్తి పుణ్యావచ నం, నవగ్రహ పూజ, లఘున్యాస పూర్వక రుద్రాభిషేకం, మనుసూక్త హావనం, బలిహరణం, పూర్ణాహుతి, మంగళహారతి, మహా మంత్రపుష్పం నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆలయ కమిటీ చైర్మన్ అరిగెల నాగేశ్వర్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 11 గంటల నుంచి అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో ధర్మపురి వెంకటేశ్వర్లు, గుండా వెంకన్న, మధు, రాధాకృష్ణచారి, గడ్డల వెంకటేశ్, మురళీగౌడ్, గోపాల్‌నాయక్, గణపతి, ఇరుకుల సుధాకర్, లక్ష్మణమూర్తి, శరత్‌యాదవ్, రాజశేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment