సర్వే పారితోషికం చెల్లించాలి
ఆసిఫాబాద్‌రూరల్: ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించిన ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న పారితోషకం చెల్లించాలని పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారికి వినతిపత్రం అందించారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఆడె ప్రకాశ్ మాట్లాడుతూ గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి కు టుంబ సర్వేను ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమర్థవంతంగా పూర్తి చేశారని తెలిపారు. సర్వేలో పాల్గొన్న వారికి అందాల్సిన పారితో షకం నేటికీ అందలేదని, ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మధుకర్, రాజేశ్వర్, తిరుపతి, శ్యాంసుందర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment