విధులు బహిష్కరించిన న్యాయవాదులు
ఆసిఫాబాద్‌అర్బన్: రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈ నెల 12న ఓ నిందితుడు జిల్లా జడ్జిపై చెప్పు విసరడాన్ని ఖండిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవా దులు విధులు బహిష్కరించి నిరసన తెలిపా రు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాపర్తి రవీందర్ మాట్లాడుతూ వివిధ నేరాల్లో నిందితుడిగా ఉన్న కిరణ్‌సింగ్ అలియాస్ సర్దార్ చీమకొర్తికి రంగారెడ్డి జిల్లా 9వ అదనపు సెషన్ జడ్జి జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చారని తెలిపారు. అనంతరం అతడు మహిళా జడ్జిపై చెప్పు విసరడం బాధాకరమన్నారు. నిందితుడిని చట్టపరంగా కఠినంగా శిక్షించాల ని కోరారు. న్యాయవాదులు బానోత్ గణేష్, శ్యాంరావు, గణపతి, విద్యాసాగర్, బోనగిరి సతీశ్‌బాబు, అనిత తదతరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment