శ్రామ్‌నేర్ శిబిర్ జయప్రదం చేయాలి
వాంకిడి(ఆసిఫాబాద్): మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్‌లో మార్చి 3 నుంచి 9 వరకు నిర్వహించే బౌద్ధ ధమ్మ దీక్ష శ్రామ్‌నేర్ శిబిర్‌ను జయప్రదం చేయాలని బీఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్, అంబేడ్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి దుర్గం సునీల్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో శనివారం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఎస్‌ఐ, అంబేడ్కర్ యువజన సంఘం, సిద్దార్థ యువజన సంఘం, రమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో జేత్వాన్ బుద్ధ విహార్‌లో ఏడు రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బౌద్ధులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నాగ్‌పూర్‌లోని దీక్ష భూమి బౌద్ధ గురువు బదంత్ ధమ్మ సారథి బుద్ధుడి ప్రవచనాలు, ధమ్మ బోధన చేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఎస్‌ఐ మండల అధ్యక్షుడు జైరాం ఉప్రే, ఎస్‌ఎస్‌డీ ఆసిఫాబాద్ ఇన్‌చార్జి సందీప్, నాయకులు విలాస్, రాజేంద్రప్రసాద్, రోషన్, విజేయ్, శ్యాంరావు, దుర్గం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment