2008 డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్
ఆసిఫాబాద్‌రూరల్: 2008 డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చినట్లు డీఈవో గమానియ ల్ తెలిపారు. జిల్లా కేంద్రంలో శనివారం అ భ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. డీఈ వో మాట్లాడుతూ 2008 డీఎస్సీ ద్వారా ఎస్జీటీ పోస్టులకు 30 మంది బీఈడీ అభ్యర్థులు ఎంపికయ్యారని తెలిపారు. శనివారం సర్టిఫికెట్ పరిశీలనకు 20 మంది హాజరయ్యారని తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో వీరిని కాంట్రాక్టు పద్ధతిలో స్కూల్ గ్రేడ్ టీచర్లుగా నియమించామని, సక్రమంగా విధులకు హాజరు కావాలని సూచించారు. జిల్లా పరీక్ష నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు, ఎంఈవో సుభాష్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment