20న ‘చలో విద్యుత్ సౌధ’
ఆసిఫాబాద్‌రూరల్: హైదరాబాద్‌లో ఈ నెల 20న చలో విద్యుత్ సౌధ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ ఆర్టిజన్ల కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు మారుతి తెలిపారు. జిల్లాలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట శనివారం చలో విద్యుత్ సౌధ కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పని చేస్తున్న ఆర్టిజన్లను విద్యార్హత ఆధారంగా సబ్ ఇంజినీర్లు, జూనియర్ అసిస్టెంట్లు, జేఎల్‌ఎంలుగా పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 20న నిర్వహించే కార్యక్రమానికి జిల్లాలోని కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్టిజన్లు శ్రీనివాస్, సతీశ్, మధు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment